Pawan Kalyan: దుర్మార్గుడైన చంద్రబాబుకు బుద్ధి చెప్పండి.. నా భార్య, కోడలిని కూడా ఈడ్చుకు వచ్చారు: పవన్ కల్యాణ్ కు ముద్రగడ లేఖ

  • టీడీపీని సముద్రంలో నిమజ్జనం చేయండి
  • నా భార్య, కోడలిని కూడా ఈడ్చుకు వచ్చారు
  • చంద్రబాబుకు మీరే పట్టాభిషేకం చేయించారు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని, టీడీపీని సముద్రంలో కలిపేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం సూచించారు. ఇందులో భాగంగా ఒక మెట్టు దిగైనా సరే... ఇతర పార్టీల సహకారం తీసుకుని ముందడుగు వేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాశారు.

2014 ఎన్నికల్లో కాపు జాతిని, మిమ్మల్ని అడుక్కొని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత దళితులను టార్గెట్ చేయించి, పోలీసులతో కొట్టించారని... ఆ తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తే తన భార్య, కోడలిని పట్టుకుని ఈడ్చుకు వచ్చారని అన్నారు. అలాంటి దుర్మార్గుడిని మీరు భుజం మీద ఎక్కించుకుని, మోశారని... అపర మేధావి, పాలనాదక్షుడు, కొత్త రాష్ట్రం అంటూ ప్రజలకు చెప్పి పట్టాభిషేకం చేయించారని చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు. మీ అమ్మగారికి జరిగిన అవమానాన్ని పక్కనపెట్టి, రోడ్డు మీదకు రావాలని... టీడీపీని సముద్రంలో నిమజ్జనం చేసేంత వరకు ఇంటి మొహం కూడా చూడవద్దని సూచించారు.

Pawan Kalyan
mudragada padmanabham
Telugudesam
jansena
kapu
  • Loading...

More Telugu News