ravi prakash: 'బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం' కార్యక్రమానికి స్వాగతం... పవన్ కల్యాణ్ లేటెస్ట్ ట్వీట్స్

  • ఆర్కే.. 'బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం' కార్యక్రమానికి స్వాగతం
  •  నీది ఆంధ్రజ్యోతా? లేక టీడీపీజ్యోతా?
  • రవిప్రకాశ్ కు సంబంధించి ఇది లేటెస్ట్ అప్ డేట్

మీడియాపై కన్నెర్రజేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సదరు మీడియా సంస్థల అధిపతులపై తన ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్నారు. రెండు గంటల క్రితం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశిస్తూ 'బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంధ్రజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు.

ఇదే సమయంలో టీవీ9 రవిప్రకాశ్ ను ఉద్దేశిస్తూ మరో ట్వీట్ ను పవన్ చేశారు. టీవీ9 రవిప్రకాశ్ కు సంబంధించి మా గ్రౌండ్ స్టాఫ్ ఇచ్చిన లేటెస్ట్ అప్ డేట్ ఇది అంటూ మెసేజ్ పెట్టారు. 'టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై చెప్పుతో దాడి' పేరుతో ఓ పేపర్లో వచ్చిన కథనాన్ని అప్ లోడ్ చేశారు. 

ravi prakash
tv9
radha krishna
andhrajyothi
Pawan Kalyan
janasena
  • Error fetching data: Network response was not ok

More Telugu News