roja: పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ఊరుకోం: రోజా

  • వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదు
  • పవన్ ను చంద్రబాబు టార్గెట్ చేశారు
  • క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ను తరిమికొట్టే ప్రయత్నంలో బాధితులకు అండగా ఉంటామని సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని... అప్పటి నుంచి ఇప్పటిదాకా క్యాస్టింగ్ కౌచ్ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని... ఇకపై ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

పబ్లిసిటీ కోసం ఎవరైనా సరే ఇండస్ట్రీ పరువు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ పరిశ్రమ కూడా పోరాడుతుందని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో నియామకాలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని అన్నారు.

roja
Pawan Kalyan
Chandrababu
special status
Casting Couch
Tollywood
  • Loading...

More Telugu News