Chandrababu: గవర్నర్ నరసింహన్ ను కలవనున్న చంద్రబాబు

  • నేడు విజయవాడలో పర్యటించనున్న నరసింహన్
  • 11 గంటలకు గవర్నర్ తో భేటీ 
  • కేంద్ర వైఖరి, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం

ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ను కలవబోతున్నారు. 11 గంటలకు వీరిద్దరూ సమావేశం కానున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించవచ్చని సమాచారం. గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ నరసింహన్ పై ఏపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నరసింహన్ కేవలం తెలంగాణ గవర్నర్ మాదిరి వ్యవహరిస్తున్నారని, ఏపీని సరిగా పట్టించుకోవడం లేదని గతంలో బీజేపీ నేతలు సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Chandrababu
narasimhan
meeting
  • Loading...

More Telugu News