Ghaziabad: ఊహించని ప్రమాదం! కారు హ్యాండ్ బ్రేక్ తీసేసిన చిన్నారి.. లోయలో పడిన వాహనం.. ఏడుగురి దుర్మరణం!

  • వివాహ వేడుకకు వెళ్తుండగా ఘటన
  • తీవ్రంగా గాయపడిన ఆరుగురి పరిస్థితి కూడా విషమం
  • పెళ్లి ఇంట్లో విషాదం

ఊహించని ప్రమాదం ఓ పెళ్లి వేడుకలో విషాదం నింపింది. కారుకు వేసిన హ్యాండ్ బ్రేక్‌ను ప్రమాదవశాత్తు చిన్నారి తొలగించడంతో అది కాస్తా, లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలవగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. ఖోడాకు చెందిన 12 మంది పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు టాటా సుమోలో విజయనగర్‌లోని బెహ్రంపూర్ బయలుదేరారు. కొంతదూరం ప్రయాణించాక జాతీయ రహదారిపై లోయకు సమీపంలో కారు ఆపి డ్రైవర్ కిందికి దిగాడు. అయితే, ముందు సీట్లో కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తు కారుకు వేసిన హ్యాండ్ బ్రేక్‌ను తొలగించింది. అంతే.. వాహనం వేగంగా ముందుకు కదులుతూ పెద్ద శబ్దంతో లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో పెళ్లి కొడుకు తండ్రి ఓం ప్రకాశ్ (55), చిన్నారి, నలుగురు మహిళలు, మరో వ్యక్తి ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Ghaziabad
Train Accident
hand-brake
Tata Sumo
  • Loading...

More Telugu News