jaleel khan: కాపులను మీ అన్న ఆల్రెడీ ముంచేశారు... ఇప్పుడు మళ్లీ మీరు తయారవుతున్నారు: పవన్ పై జలీల్ ఫైర్

  • మీడియాను నియంత్రించాలనుకోవడం సరైంది కాదు
  • నిమిషాల్లోనే యూటర్న్ తీసుకున్న వ్యక్తి పవన్
  • పవన్ విధానాలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేవు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యారెక్టర్ లేని మనిషి అని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా ముఖ్య పాత్రను పోషిస్తుందని... అలాంటిది, కొన్ని ఛానళ్లను చూడవద్దని పవన్ కల్యాణ్ ఎలా చెబుతారని దుయ్యబట్టారు. మీకు అనుకూలంగా వార్తలు వేస్తే ఆయా ఛానళ్లను చూడాలా? మీకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తే చూడకూడదా? అని ప్రశ్నించారు.

మీ పద్ధతి సరిగా లేదని... తీరు మార్చుకోవాలని సూచించారు. మీ అన్న చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చి మీ సామాజికవర్గమైన కాపులను ముంచేశారని... ఇప్పుడు వారిని మరోసారి ముంచేందుకు మీరు వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ లను పొగిడిన పవన్ కల్యాణ్ నిమిషాల్లోనే యూటర్న్ తీసుకుని విమర్శలు మొదలు పెట్టారని మండిపడ్డారు. పవన్ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేవని అన్నారు.

jaleel khan
Pawan Kalyan
Chiranjeevi
Chandrababu
Nara Lokesh
  • Loading...

More Telugu News