Mahesh Babu: మహేశ్‌ బాబుపై కన్నడ ఫ్యాన్స్‌ అలక.. వెంటనే ట్వీట్‌ చేసి సంతోషపెట్టిన హీరో!

  • 'భరత్‌ అనే నేను'కి వస్తోన్న స్పందన పట్ల మహేశ్‌ హర్షం
  • తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ధన్యవాదాలు
  • కన్నడలో ఎందుకు చేయలేదని కర్ణాటక ఫ్యాన్స్ ఆగ్రహం
  • కొద్ది సేపటి క్రితం కన్నడలోనూ ట్వీట్ చేసిన మహేశ్‌

తాను నటించిన 'భరత్ అనే నేను' సినిమాకి వస్తోన్న ఆదరణ పట్ల మహేశ్‌ బాబు హర్షం వ్యక్తం చేస్తూ నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులకు ఆయన తెలుగు, తమిళ,  హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే, తమ భాషలో ఎందుకు చేయలేదని కన్నడ అభిమానులు అలిగారు. తమ రాష్ట్రంలో 100కిపైగా స్క్రీన్లలో ఆ సినిమాను విడుదల చేశారని, మరి తమకెందుకు ధన్యవాదాలు చెప్పలేదని మహేశ్‌ బాబుని విమర్శిస్తున్నారు.

కర్ణాటకలోనూ మహేశ్ బాబుకి అభిమానులు ఉన్నారని, కన్నడ ఫ్యాన్స్‌ ఆయనకు కనిపించడం లేదా? అని మహేశ్‌ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాక, కన్నడ అభిమానులు మహేశ్‌ బాబుకు త్వరలోనే గుణపాఠం చెబుతారని కొందరు హెచ్చరిస్తూ ట్వీట్లు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మహేశ్‌ బాబు ఎట్టకేలకు ఫేస్‌బుక్‌లో తన పోస్టును ఎడిట్‌ చేసి కన్నడలోనూ థ్యాంక్స్‌ చెప్పాడు. ట్విట్టర్‌లో తన కన్నడ అభిమానుల కోసం కొత్త ట్వీట్‌ చేసి కొద్దిసేపటి క్రితం థ్యాంక్స్‌ తెలిపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News