merlapaka gandhi: చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తాను: మేర్లపాక గాంధీ

  • చరణ్ అంటే నాకు ఇష్టం 
  • మా మధ్య మంచి సాన్నిహిత్యం వుంది  
  • ఆయనతో ఒక కథ అనుకున్నాను  

కొత్త కథలతో .. వైవిధ్యభరితమైన కాన్సెప్టులతో యువదర్శకులు ప్రయోగాలు చేస్తూ .. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి యువదర్శకుల జాబితాలో మేర్లపాక గాంధీ ఒకరుగా కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. చరణ్ తో ఒక సినిమా చేస్తానని చెప్పాడు.

 'కృష్ణార్జున యుద్ధం' సినిమా కంటే ముందుగానే చరణ్ తో ఒక సినిమాను అనుకున్నాను. చరణ్ కి ఆ కథను వినిపించడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అలా అని ఆ ప్రాజెక్టు ఆగిపోలేదు .. పోస్ట్ పోన్ అయిందంతే. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం .. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. తప్పకుండా ఆయనతో ఒక సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.  

merlapaka gandhi
charan
  • Loading...

More Telugu News