rape: కేంద్ర మంత్రివర్గం కీలక ఆర్డినెన్స్‌.. చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇకపై మరణశిక్షే!

  • ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం
  • పోక్సో చట్టానికి సవరణలు చేసేందుకు ఆమోదం
  • 0-12 ఏళ్ల  చిన్నారులపై అత్యాచారం జరిపితే ఇక మరణదండన

అభం శుభం తెలియని చిన్నారులపై కూడా మృగాళ్లు దారుణ చేష్టలకు పాల్పడుతోన్న ఘటనలు దేశంలో ప్రతిరోజూ ఏదో చోట వెలుగులోకి వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల కథువాలో చిన్నారిపై ఘోరాతి ఘోర దారుణం జరగడంతో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

దీంతో ఈ విషయంపై కేంద్ర మంత్రి వర్గం కీలక చర్చలు జరిపింది. కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పోక్సో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. 0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారం జరిపే వారికి మరణ శిక్ష విధించే విధంగా రూపొందిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News