kim jong un: ప్రపంచానికి కిమ్ మంచి వార్త చెప్పారు: ట్రంప్ ప్రశంస
- కిమ్ జాంగ్ ఉన్ ను అభినందించిన ట్రంప్
- కిమ్ తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నా
- కిమ్ ప్రకటన ఉత్తరకొరియాతో పాటు ప్రపంచానికి మంచిది
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి శుభవార్త చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. అణు ప్రయోగాలు నిలిపేస్తున్నామని కిమ్ చేసిన ప్రకటనపై ట్రంప్ స్పందిస్తూ, ఇది చాలా పెద్ద పురోగతి అని అన్నారు. కిమ్ తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ ప్రకటన ఉత్తరకొరియాతో పాటు ప్రపంచానికి కూడా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఉత్తరకొరియా, అమెరికా అధ్యక్షుల సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం మే లేదా జూన్ లో జరిగే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో ఉత్తరకొరియా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆంక్షల ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా చూపిందని ఉత్తరకొరియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలు తొలగించుకోవడంలో భాగంగా అణుపరీక్షలు ఆపేస్తున్నామని ప్రకటించారు.