manmohan singh: అభిశంసన తీర్మానంపై కాంగ్రెస్ పార్టీలో విభేదాలు...! నోటీసుపై సంతకం చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తిరస్కారం

  • మరో నలుగురు సీనియర్ నేతలు దూరం
  • వారు చిదంబరం, మనుసింఘ్వి, మొయిలీ, తివారీ
  • కాంగ్రెస్ పార్టీలో లేని సంపూర్ణ మద్దతు

కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీల సభ్యులు కూడా అనుకూలంగా సంతకాలు చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ సొంత సభ్యులు కొందరు దీనికి దూరంగా ఉండడం విశేషం.

అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు. మన్మోహన్ సింగ్ తో పాటు, అభిషేక్ మను సింఘ్వి, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, మనీష్ తివారీ అభిశంసన తీర్మాన నోటీసుపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలోనే దీనిపై పూర్తి మద్దతు లేదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వని కుమార్ సైతం దీనితో బహిరంగంగా విభేదించారు. ఈ తీర్మానాన్ని తీసుకొచ్చి ఉండాల్సింది కాదని ఆయన పేర్కొనడం పరిస్థితిని తెలియజేస్తోంది.

  • Loading...

More Telugu News