Prime Minister: ఏంజెలా మెర్కెల్ తో భేటీ అద్భుతంగా జరిగిందన్న ప్రధాని మోదీ

  • ముగిసిన మూడు దేశాల పర్యటన
  • చివరిగా బెర్లిన్ లో మెర్కెల్ తో సమావేశం
  • పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు

ఫ్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసింది. చివరిగా ఆయన జర్మనీలోని బెర్లిన్ లో పర్యటించారు. అంతకుముందు బ్రిటన్ లో కామన్వెల్త్ దేశాధినేతల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బెర్లిన్ చేరుకుని జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తో సమావేశమయ్యారు.

‘‘జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెలర్ తో అద్భుతమైన భేటీ జరిగింది. భారత, జర్మనీ సహకారానికి సంబంధించి ఎన్నో అంశాలపై చర్చించాం. అలాగే, ఇతర ప్రపంచ అంశాలు కూడా మా మధ్య చర్చకు వచ్చాయి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఇరువురు నేతలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రాజీవ్ కుమార్ సైతం తన ట్విట్టర్ పేజీలో తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన స్నేహబంధం మరింత బలపడిందంటూ ట్వీట్ చేశారు. బ్రిటన్, స్వీడన్, జర్మనీ ఈ మూడు దేశాల్లో మోదీ పర్యటించారు. 

Prime Minister
Narendra Modi
germany
  • Loading...

More Telugu News