Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీఎం అయినట్టు ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు : నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు

  • పవన్ ఇంకా రాజకీయ పరిపక్వత సాధించలేదు
  • మీడియాపై దాడితో సమాజానికి ఏం చెప్పదలచుకున్నారు?
  • రాజకీయాల్లోకి రాగానే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు
  • తన వల్లే అధికారంలోకి వచ్చారనే భ్రమలో పవన్ ఉన్నారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం అయినట్టు ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారని నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఏబీఎన్’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాగానే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరని, చంద్రబాబు, మోదీ తన వల్లే అధికారంలోకి వచ్చారనే భ్రమలో పవన్ ఉన్నారని అన్నారు. పవన్ ఇంకా నటుడిగానే ఆలోచిస్తున్నారని, ఆయన ఇంకా రాజకీయ పరిపక్వత సాధించలేదని విమర్శించారు.

మీడియాపై దాడితో సమాజానికి పవన్ ఏం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. కాగా, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఏబీఎన్’ పై పవన్ అభిమానులు దాడి చేయడం సరికాదని, మీడియాపై దాడి ఆత్మహత్యా సదృశ్యమని అన్నారు. ఈ దాడి పట్ల పవన్ తక్షణమే ఓ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పవన్ తీరు ఇలాగే ఉంటే రాజకీయాల్లో గౌరవం ఉండదని అన్నారు.

Pawan Kalyan
producer tripura neni
  • Loading...

More Telugu News