Tollywood: గాయత్రి, రాధ, కల్యాణి... అందరి సంగతి తెలుసు... చెప్పాలా?: శ్రీరెడ్డి

  • తనను విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి
  • గాయత్రి గత జీవితం తెలుసునని వ్యాఖ్య
  • కల్యాణిపై ఎన్నో కేసులున్నాయని చెప్పిన శ్రీరెడ్డి
  • తనను వేధిస్తే తాట తీస్తానని హెచ్చరిక

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం సాగిస్తున్న శ్రీరెడ్డి, తనను విమర్శిస్తున్న మహిళా నటులపై విరుచుకుపడింది. ఈ ఉదయం నుంచి తన ఫేస్ బుక్ ఖాతాలో పలు పోస్టులను పెట్టిన ఆమె, గాయత్రి, రాధ, కల్యాణిల పేర్లు చెబుతూ, వారందరి సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించింది.

"నాకు గాయత్రి గత జీవితం గురించి తెలుసు. ఆమె ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకుంది? పెళ్లయిందా? కాలేదా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరు? అన్న విషయాలు నాకు తెలుసు. నాకు అమ్మాయిలపై గౌరవం ఉంది కాబట్టి వాటిని బయటపెట్టే ఉద్దేశం లేదు. తరువాత రాధ... మా టీవీలో ఆ అమ్మాయిని పీకేసి నన్ను 'పాతాళ భైరవి' ప్రోగ్రామ్ లో పెట్టారు. దానిపై ఇంత ఆగ్రహంతో ఉందని అనుకోలేదు" అని ఉదయం 9 గంటల సమయంలో ఓ పోస్టు పెట్టింది.

ఆపై, "కల్యాణి లైఫ్ హిస్టరీలో ఎన్ని పోలీసు కేసులు, కోర్టు కేసులు ఉన్నాయి. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంది.. దేవుడు లక్కీగా పిల్లలను ఇవ్వలేదు. ఉండుంటే పాపం వాళ్లను తన్నేసేది. 2011 యూఎస్ లో ఏం జరిగిందో అందరూ చెప్పారు. ఈవిడ పెట్టే టార్చర్ గురించి మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు... నేనేమీ చెప్పను. కొన్ని విలువలను నేను పాటిస్తాను" అని వ్యాఖ్యానించింది.

 ఆపై 10 గంటల సమయంలో "నా పర్సనల్ లైఫ్ మీద అబద్ధాలతో కూడిన ప్రచారం చేస్తున్న వారికి... లీగల్ కేసులు పెరుగుతాయి. వెంటనే వీడియోస్ తీయించకపోతే బాగోదు. నేను ఇక మాట్లాడను దీనిపై. ఇప్పటికే కేసులు ఉన్నాయి మీపైన. ప్రజలను వేధించడం మానుకోండి. నన్ను మానసికంగా హింసించే హక్కు, నన్ను విమర్శించే హక్కు, అబద్ధాలతో ప్రచారం చేసే హక్కు మీకు లేదు. ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారు. మీకు లీగల్ ఫైట్ తప్పదు. ఖబడ్దార్ కల్యాణి, గాయత్రి... మరికొన్ని పేర్లు త్వరలో వస్తాయి" అని చెప్పింది.

"ఈరోజు వరకూ నన్ను ఇరిటేట్ చేసిన వారిపై మాత్రమే నేను నిందారోపణలు చేశా. అనవసరంగా నా వ్యక్తిగత జీవితం మీద ఎవరు మాట్లాడినా తాట తీస్తా. లీగల్ గా ఇరుక్కోకుండా ఉండటం మంచిది. తరువాత... కేసులు పెట్టిన తరువాత వేధిస్తే ఉపయోగం లేదు. పవన్ వ్యవహారం వేరే. నేను ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. క్షమాపణలు కూడా కోరాను" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.



Tollywood
Casting Couch
Sri Reddy
Kalyani
Gayatri
Radha
  • Error fetching data: Network response was not ok

More Telugu News