Hardik Pandya: 'నా బుజ్జి సోదరా... క్షమించరా': హార్దిక్ పాండ్యా

  • ఆర్సీబీతో మ్యాచ్ గాయపడ్డ ఈషాన్ కిషన్
  • హార్దిక్ పాండ్యా వేసిన బంతి తాకి గాయం
  • క్షమాపణలు కోరిన పాండ్యా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కీపింగ్ చేస్తున్న ఈషాన్ కిషన్ కు సహచరుడు హార్దిక్ పాండ్యా విసిరిన బంతి బలంగా తగిలి, కుడి కన్నుకు గాయమైన సంగతి తెలిసిందే. ఎంఐ, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా, 13వ ఓవర్ లో ఈ ఘటన జరుగగానే కిషాన్, మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆపై ఆదిత్య తారేతో కీపింగ్ చేయించింది ముంబై జట్టు.

గాయపడిన కిషాన్ కు తాను బలంగా విసిరిన బంతే తాకిందన్న బాధలో ఉన్న హార్దిక్ పాండ్యా, సారీ చెప్పాడు. "నా బుజ్జి సోదరా క్షమించరా... త్వరగా కోలుకో" అంటూ ఓ ట్వీట్ పెట్టాడు. ఆపై తనకన్నా ఎంతో జూనియర్ అయిన కిషన్ తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ సంవత్సరం ఐపీఎల్ వేలంలో ఈషాన్ కిషన్ ను ముంబై ఫ్రాంచైజీ రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Hardik Pandya
Eshan kishan
ipl
  • Loading...

More Telugu News