chidambaram: పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకి తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?: చిదంబరం
- పెట్రోల్ సొమ్ముతోనే కేంద్రం బతుకుతోంది
- చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి
- కేంద్రంపై చిదంబరం ఆగ్రహం
గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరల్లో చిన్న మార్పు రాగానే భారత్ లోని వినియోగదారులపై పెను భారం పడుతోంది. తాజాగా డీజిల్ ధర రికార్డు స్థాయిలో గరిష్ఠానికి చేరుకోగా, పెట్రోల్ ధర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ సొమ్ముతోనే కేంద్రం బతుకుతోందని ఆరోపించారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావటానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయి? అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.