Pawan Kalyan: మీ అమ్మనంటే రోషం వచ్చిందా.. మా‌కైతే అమ్మ కాదా?: పవన్‌పై మరోమారు విరుచుకుపడిన శ్రీరెడ్డి

  • పవన్‌పై మరోమారు నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి
  • తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేసిన నటి
  • ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరిక

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై సినీ నటి శ్రీరెడ్డి మరోమారు విరుచుకుపడింది. అమ్మ ఎవరికైనా అమ్మేనని, మీ అమ్మని అనగానే బాధ అనిపిస్తే మరి మా తల్లుల సంగతేంటని నిలదీసింది. తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, తనను ఎవరూ వెనకుండి నడిపించడం లేదని స్పష్టం చేసింది. పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు చేతకాదని ఎద్దేవా చేసింది. అసలు ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరూ గమనిస్తున్నారని పేర్కొంది. 'మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకూ అంతే'నని పేర్కొన్న శ్రీరెడ్డి.. తమని అన్నప్పుడు, తమ తల్లులను దూషించినప్పుడు, రోడ్డు మీద పడి రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్ దాడులకు తెగబడుతున్నప్పుడు తమ బాధ అర్థం కాలేదా? అని ప్రశ్నించింది.

తాను అన్నింటికీ సిద్ధపడే పోరాటంలోకి దిగానని, ప్రాణాలకు సైతం లెక్క చేయనని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. పవన్ తన ఆధిపత్యాన్ని సినిమాల్లో చూపించాలని, ఫిలిం చాంబర్ పైన కాదని హితవు పలికింది. జర్నలిస్టుల జోలికి రావద్దని హెచ్చరించింది. ఏదో ఒకరోజ నిజాలు బయటకు వస్తాయని, ఒకరోజు హడావుడికి భయపడబోనని తేల్చి చెప్పింది. తాను ఎవరినీ వదిలిపెట్టబోనని మరోమారు హెచ్చరించింది. ఈ సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మకు, న్యూస్ చానళ్లకు క్షమాపణలు తెలిపింది.

Pawan Kalyan
sri reddy
Tollywood
  • Loading...

More Telugu News