apcc: రాజ్యాంగం సంక్షోభంలో పడింది: రఘువీరారెడ్డి
- రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
- ఎస్సీ, ఎస్టీలపై కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు
- రిజర్వేషన్లు తొలగించాలన్నదే బీజేపీ రహస్య అజెండా
రాజ్యాంగం సంక్షోభంలో పడిందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంఘాల ఛైర్మన్‌లతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని తొలగించే అజెండాను బీజేపీ సర్కారు తయారుచేస్తోందని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, రిజర్వేషన్లు తొలగించాలన్నదే వారి రహస్య అజెండా అని ఆరోపించారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని కూడా తొలగించాలనుకుంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం మీద ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు నమ్మకం లేదని అన్నారు.