amit shah: అమిత్ షా సనాతన హిందువు!: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరణ

  • అమిత్  జైనుడన్న సిద్ధరామయ్య  
  • ఆయన కుటుంబీకులు సనాతన హిందువులుగా కొనసాగుతున్నారు
  • కాంగ్రెస్ దిగజారుడు ఆరోపణలు చేస్తోంది

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మతం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమిత్ షా అసలు హిందువే కాదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, సిద్ధరామయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా ఒక సనాతన హిందువు అని అన్నారు. అమిత్, ఆయన కుటుంబీకులు సనాతన హిందువులుగా కొనసాగుతున్నారని చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే... అమిత్ షా హిందువు కాదంటూ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ స్థాయి అర్థమవుతోందని విమర్శించారు. ఇటీవల మైసూరులో సిద్ధరామయ్య మాట్లాడుతూ, అమిత్ షా హిందువునని చెప్పుకుంటున్నారని... ఆయన జైన మతస్తుడని అన్నారు. హిందుత్వంపై నమ్మకముంటే, తాను హిందువునే అని అమిత్ షా చెప్పాలని సవాల్ విసిరారు. 

amit shah
siddaramaiah
religion
  • Loading...

More Telugu News