Mahesh Babu: 'భరత్ అనే నేను' టీమ్ ను అభినందించిన రాజమౌళి

  • మహేశ్ అద్భుతంగా నటించాడు 
  • అందరూ పాత్రల్లో ఒదిగిపోయారు 
  • డీవీవీ దానయ్య మంచి సినిమా తీశారు

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సహజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండవ సినిమాగా వచ్చిన 'భరత్ అనే నేను'పై అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాలతో ఈ సినిమాకి వెళ్లిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండటంతో .. ఈ సినిమా సక్సెస్ దిశగా పరుగులు తీయనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సినిమా చూసిన వెంటనే రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అలాగే ఆయన 'భరత్ అనే నేను' సినిమా చూశారు. "ఒక కమర్షియల్ సినిమాలో స్వయంపాలన వంటి అంశాన్ని ప్రస్తావించడమనేది కొరటాల గొప్పతనం. ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ చాలాబాగా వచ్చింది" అని ప్రశంసించారు.

"మహేశ్ బాబు అద్భుతమైన నటనను కనబరిచాడు. ఆయా పాత్రలకి గాను నటీనటులు బాగా కుదిరారు .. ప్రతి ఒక్కరు తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇంతమంచి సినిమాను అందించిన నిర్మాత డీవీవీ దానయ్య గారికి .. టీమ్ లోని ఇతర సభ్యులందరికీ అభినందనలు" అంటూ రాజమౌళి తన మనసులోని మాటను చెప్పారు.          

Mahesh Babu
kira advani
  • Loading...

More Telugu News