ranbir kapoor: రణ్‌ బీర్‌ కపూర్‌ తో కలసి దీపికా పదుకొణే ర్యాంప్ వాక్!

  • మిజ్వాన్ ఎన్జీవో కోసం ర్యాంప్ వాక్ చేసిన మాజీ ప్రేమజంట
  • మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు ధరించిన మాజీ ప్రేమికులు
  • షేర్వాణీలో రణ్ బీర్, లెహంగాలో దీపిక

ప్రముఖ నటి షబానా అజ్మీ ఏర్పాటు చేసిన 'మిజ్వాన్‌' ఎన్జీవోకు విరాళాల సేకరణకు బాలీవుడ్‌ మాజీ ప్రేమ జంట రణ్‌ బీర్‌ కపూర్‌, దీపిక పదుకొణె ర్యాంప్ వాక్ చేయడం ఆసక్తి రేపింది. రణ్ బీర్ కపూర్, దీపిక ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కత్రినాతో ప్రేమ విఫలమై రణ్ బీర్ ఒంటరిగా ఉండగా, రణ్ వీర్ సింగ్ తో దీపిక సెటిలైపోయింది. త్వరలో ఆ జంట వివాహం చేసుకోనున్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి.

 ఈ క్రమంలో మాజీ ప్రేమికులిద్దరూ గత రాత్రి ముంబైలో జరిగిన 2018 మిజ్వాన్‌ ఫ్యాషన్ షోలో చేతిలో చేయి వేసుకుని ర్యాంప్ వాక్‌ చేసి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన షేర్వాణీలో రణ్‌ బీర్‌, లెహెంగాలో దీపిక మెరిసిపోయారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఏప్రిల్ 9న జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల నిన్నటికి వాయిదా వేసినట్టు మనీశ్ మల్హోత్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో షబానా అజ్మీ, జావేద్‌ అక్తర్‌, మౌనీ రాయ్‌, నీతూ కపూర్‌, కృతి కర్బంద, పూనమ్‌ ధిల్లన్‌‌, పుల్కిత్ సమ్రాట్‌ తదితరులు పాల్గొన్నారు.

ranbir kapoor
Deepika Padukone
Bollywood
fasion show
  • Error fetching data: Network response was not ok

More Telugu News