Pawan Kalyan: ఎట్టకేలకు బయటికొచ్చి.. పిలిం ఛాంబర్‌ నుంచి వెళ్లిపోయిన పవన్ కల్యాణ్‌

  • తన తల్లికి న్యాయం చేయాలన్న పవన్‌
  • కొద్దిసేపు ఫిలిం ఛాంబర్‌లోనే బైఠాయింపు
  • ఫ్యాన్స్‌కి అభివాదం చేస్తూ వెళ్లిన పవన్‌

తన తల్లికి న్యాయం చేసే వరకు తాను ఫిలిం ఛాంబర్‌ నుంచి వెళ్లేది లేదని చెప్పి, సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అక్కడే కూర్చున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇంతకు క్రితమే ఫిలిం ఛాంబర్‌లోంచి బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్‌ ఆయన కారు వద్దకు వెళ్లే సమయంలో అభిమానులు పవన్‌ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పవన్‌ కల్యాణ్‌ ని అభిమానులు చుట్టుముట్టడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కారు ఎక్కుతోన్న సమయంలో పవన్ కల్యాణ్‌ తన అభిమానులకు అభివాదం చేశారు. 

Pawan Kalyan
Tollywood
fans
  • Loading...

More Telugu News