Mahesh Babu: మహేశ్ బాబు మరోసారి దుమ్మురేపేశాడు

  • 'భరత్' పాత్రలో మహేశ్ జీవించాడు 
  • ముఖ్యమంత్రిగా హుందాగా కనిపించాడు
  • యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో శభాష్ అనిపించాడు    

కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ రావడం వలన, అన్ని ప్రాంతాల్లోని థియేటర్లు సందడిగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో 'భరత్' అనే పాత్రకి మహేశ్ బాబు జీవం పోశాడని అంటున్నారు. ముఖ్యమంత్రి పాత్రలో ఆయన చాలా హుందాగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు.

తండ్రి మరణం తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే సమయంలోను  .. ప్రజలకిచ్చిన మాట కోసం ఆరాటపడే నాయకుడిగాను ఆయన నటన అద్భుతమని అంటున్నారు. సున్నితమైన హావభావాలను మహేశ్ చాలా సహజంగా పండించాడని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహేశ్ యాక్షన్ .. ఎమోషన్ కలగలిసిన తన నటనాపటిమతో సినిమాను నిలబెట్టేశాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహేశ్ బాబు .. కొరటాలతో కలిసి మరోసారి దుమ్మురేపేశాడన్న మాట.      

Mahesh Babu
kiara advani
  • Loading...

More Telugu News