Pakistan: బాలీవుడ్ నటుడు, సింగర్ అలీ జాఫర్ వేధించాడని ఆరోపించిన పాక్ సింగర్

  • అలీ జాఫర్ నన్ను చాలా సార్లు లైంగికంగా వేధించాడు
  • నేను మాట్లాడితే మరొకరు తమ బాధల్ని పంచుకోగలుగుతారు
  • మీషాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్న అలీ 

‘టోటల్‌ సియప్పా’, ‘కిల్‌ దిల్‌’, ‘మేరీ బ్రదర్‌ కీ దుల్హన్‌’ తదితర బాలీవుడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న పాకిస్థానీ సింగర్ అలీ జాఫర్‌ తనను లైంగికంగా వేధించాడని పాకిస్థాన్ సింగర్ మీషా షఫి ఆరోపించింది. అలీ జాఫర్ వేధింపుల పర్వాన్ని ఆమె వెల్లడించింది. ట్విట్టర్ ద్వారా.. చాలా ఏళ్లుగా పరిచయముండి, తనతో స్టేజ్ పంచుకున్న అలీ జాఫర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.

తాను ఇద్దరు పిల్లల తల్లినని, దేనికీ భయపడనని, దైర్యంగా మాట్లాడే తత్వమున్న దాన్నని తెలిసి కూడా తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఈ వేధింపులు తన వరకే పరిమితమని భావించడం లేదని, కనీసం తాను మాట్లాడితే అయినా మరొకరు తమ బాధల్ని పంచుకోగలుగుతారని తెలిపింది. సమాజం మౌనాన్ని కోరుకుంటుందని చెప్పిన ఆమె, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు చెప్పుకోవడం కష్టమేనని పేర్కొంది. కానీ మౌనంగా ఉండడం ఇంకా ప్రమాదకరమని అభిప్రాయపడింది.

ఆమె ఆరోపణలపై వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించిన అలీ జాఫర్ ‘ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న #metoo ఉద్యమం గురించి నాక్కూడా తెలుసు. నేనూ ఓ తల్లికి కుమారుడిని, ఓ భార్యకు భర్తను, ఇద్దరు పిల్లలకు తండ్రిని. జీవితంలో నాకోసమే కాదు నా కుటుంబం, స్నేహితులకు ఎప్పుడూ అండగా నిలిచాను. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. దాచాల్సిన విషయాలేమీ లేవు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు మౌనంగా ఉండలేం. మీషా నాపై చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. ఎప్పటికీ గెలిచేది నిజమే’ అంటూ సమాధానం చెప్పాడు.

Pakistan
ali zafar
misa shafi
singers
sexual harassments
  • Error fetching data: Network response was not ok

More Telugu News