allu aravind: అల్లు అరవింద్‌ ఆ రోజు రామ్‌ గోపాల్‌ వర్మని ఏమనలేదు.. ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు: సంధ్య

  • మహిళా సంఘాల వారిని వర్మ ఎన్నో మాటలు అన్నారు
  • వర్మ వెటకారంగా మాట్లాడితే ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ అడగలేదు
  • ఈ రోజు సినీ పరిశ్రమలోని వారిని అంటే వెంటనే వచ్చేశారు

యువ నటి శ్రీరెడ్డితో సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ని తిట్టించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై నిర్మాత అల్లు అరవింద్‌ మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ విషయంపై సామాజిక కార్యకర్త సంధ్య స్పందించారు. మహిళా సంఘాల వారిని రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్నో మాటలు అన్నాడని, మహిళలపై వెటకారంగా మాట్లాడితే దాని గురించి ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ మాట్లాడలేదని, ఈ రోజు మాత్రం సినీ పరిశ్రమలోని వారిని అనడంతో వెంటనే వచ్చేశారని విమర్శించారు.

వర్మ విషయంలో గతంలో సినిమా రంగంలోని వారు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న తాము వేస్తూనే ఉంటామని సంధ్య చెప్పారు. లైవ్‌లో ఓ సామాజిక కార్యకర్తతో మాట్లాడుతూ, ఆమెతో జీఎస్టీ సినిమా తీస్తానని సినీ పరిశ్రమకు చెందిన రామ్‌ గోపాల్ వర్మ అన్నారని విమర్శించారు. తమ వరకు వస్తేకానీ సినీ పరిశ్రమ పెద్దలు స్పందించరా? అని ఆమె ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ను అంటే మాత్రం అల్లు అరవింద్‌ వర్మపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

allu aravind
RGV
Tollywood
  • Loading...

More Telugu News