shiva balaji: శ్రీరెడ్డిపై పోలీసులకు సినీనటుడు శివబాలాజీ ఫిర్యాదు

  • పవన్‌పై వ్యక్తిగత దూషణలు చేసిన శ్రీరెడ్డి
  • హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని కోరిన శివబాలాజీ

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను దూషించిన యువనటి శ్రీరెడ్డిపై సినీనటుడు శివ బాలాజీ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు గురించి ఓ లాయర్ మాట్లాడుతూ... శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలు చేసిన ఈ కేసు సమర్థవంతంగా ముందుకు వెళితే, ఆమెకు రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా, పవన్‌పై శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. ఆయనపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

shiva balaji
sri reddy
Police
Hyderabad
  • Loading...

More Telugu News