sri reddy: జీవితను క్యాష్ కమిటీ ఛైర్ పర్సన్ గా ఎలా నియమిస్తారు?: పీవోడబ్ల్యూ నేత సంధ్య

  • జీవిత వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయి
  • ముందు ఆమె భాషను మార్చుకోవాలి
  • జీవిత కేసులకు ఎవరూ భయపడరు

శ్రీరెడ్డి విషయంలో మాట్లాడుతూ సినీ నటి జీవితారాజశేఖర్ పై పీఓడబ్ల్యూ నేత సంధ్య ఇటీవల మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, సంధ్య చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని చెబుతూ, ఆమెపై జీవిత కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సంధ్య మాట్లాడుతూ, జీవిత పెట్టిన కేసులకు ఎవరూ భయపడరని అన్నారు. జీవిత మాటలు మహిళలను కించపరిచే రీతిలో ఉన్నాయని... ఆమె భాష మార్చుకోవాలని చెప్పారు.

సినీపరిశ్రమలో ఎటువంటి సమస్యలు లేవని చెబుతున్న జీవితను క్యాష్ కమిటీ ఛైర్ పర్సన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో మంచివాళ్లు తక్కువగా ఉన్నారని... మహిళలను వేధించేవాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశం కాబోతున్నామని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరారు.

sri reddy
sandhya
jeevitha
tollywood
  • Loading...

More Telugu News