Supreme Court: సుప్రీంకోర్టు వెబ్ సైట్ పై హ్యాకర్ల ఎటాక్!... పనిచేయని వెబ్ సైట్

  • ఎంతకీ తెరుచుకోని వెబ్ సైట్
  • ‘సైట్ కెనాట్ బి రీచ్డ్’ అంటూ సందేశం
  • హ్యాకింగ్ కి గురైందంటూ వార్తలు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెబ్ సైట్ ను కూడా హ్యాకర్లు వదల్లేదు. ఇటీవలే రక్షణ శాఖ వెబ్ సైట్ పై దాడి చేసిన హ్యాకర్లు తాజాగా సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ http://supremecourtofindia.nic.in/ పైనా దాడికి దిగినట్టు సమాచారం. దీనికి నిదర్శనంగా ఈ వెబ్ సైట్ ఎంత ప్రయత్నించినా ఓపెన్ కావడం లేదు. సుప్రీంకోర్టు వెబ్ సైట్ నిజంగా హ్యాకింగ్ కు గురైందా? లేక సాంకేతిక లోపాల కారణంగా నిలిపివేయడం జరిగిందా? అంటూ సామాజిక మాధ్యమాల్లో యూజర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, సాంకేతిక కారణాలతో ఆపేస్తే ఆ విషయం నోటీసు రూపంలో సైట్ లో డిస్ ప్లే అవుతుంది. కానీ, సుప్రీంకోర్టు వెబ్ సైట్ విషయంలో ఇది కనిపించకపోవడం హ్యాకింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. సంస్థలు, మంత్రిత్వ శాఖల వెబ్ సైట్లకు కూడా మోదీ సర్కారు హయాంలో రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 6న రక్షణ శాఖ వెబ్ సైట్ కూడా లోడ్ అవడంలో సమస్యలు నెలకొనడంతో హ్యాకింగ్ కి గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News