sri reddy: నేనైతే శ్రీరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యత్వం ఇవ్వను: మురళీమోహన్

  • క్రమశిక్షణ లేని వారికి 'మా' సభ్యత్వం ఇవ్వదు
  • అర్ధనగ్న ప్రదర్శన మంచి పద్ధతి కాదు
  • వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా

హీరోయిన్ శ్రీరెడ్డి వ్యవహరిస్తున్న తీరును నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ తప్పుబట్టారు. నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని... అయితే అర్ధనగ్న ప్రదర్శన మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. క్రమశిక్షణ లేని వారికి 'మా'లో సభ్యత్వం ఇవ్వరని చెప్పారు. మా అధ్యక్షుడిగా తాను ఉంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు సభ్యత్వం ఇవ్వనని ఆయన తేల్చి చెప్పారు.

ఇక వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అంటూ మురళీమోహన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి 25 మంది ఎంపీలను గెలిపిస్తే... ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా న్యాయం చేయగలుగుతారని చెప్పారు. తన కోడలు రాజకీయాల్లోకి రావాలని తాము భావించడం లేదని... నియోజకవర్గంలో తాను అందుబాటులో లేని సమయంలో మాత్రం... తన బదులు తన కోడలు సేవలు అందిస్తుందని తెలిపారు. 

sri reddy
murali mohan
tollywood
Casting Couch
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News