Chandrababu: చంద్రబాబు నిరాహారదీక్షకు భారీ ఏర్పాట్లు.. వేదికపై 250 మంది!

  • విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు దీక్ష
  • తెల్లటి గుడ్డతో స్టేడియం మొత్తం టెంట్లు
  • వడదెబ్బ తగలకుండా ఏర్పాట్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టబోతున్న నిరాహారదీక్షకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. దీక్ష విరమణ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. రేపు విజయవాడలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దీక్షాస్థలికి వచ్చే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికీ వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం మొత్తాన్ని తెల్లటి గుడ్డతో టెంట్ లాగా చేశారు. దాదాపు 250 మంది నేతలు కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఈ దీక్షకు 'ధర్మ పోరాట దీక్ష' అనే పేరును పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చంద్రబాబు ఈ దీక్షను చేపడుతున్నారు. మరోపైపు, దీక్ష ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు.

Chandrababu
hunger strike
vijayawada
  • Loading...

More Telugu News