Pawan Kalyan: అవును.. శ్రీ రెడ్డికి ఆ సలహా ఇచ్చింది నేనే.. పవన్‌కు సారీ!: రాంగోపాల్ వర్మ

  • పవన్ పేరును వాడుకోవాలని చెప్పింది నేనే
  • ఆమె ఉద్యమంపై అందరి దృష్టి పడాలనే ఆ సలహా ఇచ్చా
  • ఈ విషయంలో పూర్తి బాధ్యత నాదే
  • యూట్యూబ్‌లో క్షమాపణ వీడియో పోస్టు చేసిన ఆర్జీవీ

క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అంగీకరించాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఆ సలహా ఇచ్చానన్నాడు. ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కల్యాణ్ కూడా పలుమార్లు విమర్శించుకున్నారని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారని గుర్తు చేశాడు. రాజకీయ నేతలు చేసే పనినే తాను చేశానని పేర్కొన్నాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా మహేశ్ కత్తి పాప్యులర్ అయ్యాడని శ్రీరెడ్డికి చెప్పానని వర్మ పేర్కొన్నాడు.

తాను చెప్పినట్టు చేస్తే అందరి దృష్టి ఉద్యమం వైపు మళ్లుతుందని చెప్పానని వర్మ అంగీకరించాడు. ఈ విషయంలోకి పవన్‌ను లాగినందుకు పవన్‌కు, అతడి అభిమానులకు ఆర్జీవీ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు.

Pawan Kalyan
Ram gopal varma
Sri Reddy
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News