sandya: 'అర్జున్‌ రెడ్డి' హీరో ఆ పదం వాడితే కరెక్టా?.. శ్రీరెడ్డి అదే పదాన్ని వాడితే తప్పా?: సామాజిక కార్యకర్త సంధ్య

  • హీరో విజయ్‌ దేవరకొండ చాలా మందితో ఆ పదం అనిపించాడు
  • అప్పుడు ఎందుకు ఖండించలేదు?
  • అలా మాట్లాడకూడదని ఎందుకు నీతులు చెప్పలేదు?
  • అప్పట్లో సిగ్గుపడని ఇండస్ట్రీ ఇప్పుడెందుకు మాట్లాడుతోంది?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని యువ నటి శ్రీరెడ్డి ఓ పదాన్ని వాడుతూ దూషించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమెకు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ మరికొందరి నుంచి మాత్రం మద్దతు వస్తోంది. కొన్ని నెలల క్రితం విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్‌ రెడ్డి' సినిమాలోనూ ఇదే అసభ్య పదాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్త సంధ్య ఈ విషయంలో శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆ విషయాన్ని లేవనెత్తారు.

తాజాగా ఆమె టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. 'అర్జున్‌ రెడ్డి' హీరో విజయ్‌ దేవరకొండ ఆ మాట అంటే ఆయన హీరో అయిపోతారు.. టీవీలో నేను చూశాను.. ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులందరితో ఆ పదం అనిపించారు. మన సినీ ఇండస్ట్రీకి ఆ పదం అప్పుడు ఎంత కమ్మగా వినిపడిందో నాకు తెలియదు. ఆ పదం ఎవ్వరు మాట్లాడినా తప్పే కదా? అప్పట్లో విజయ్‌ దేవరకొండ ఆ కార్యక్రమంలో ఒక్కసారి కాదు చాలా సార్లు ప్రేక్షకులతో అనిపించారు.

విజయ్‌ దేవరకొండ అంతమందితో అనిపించినప్పటికీ సిగ్గుపడని ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఆడపిల్ల ఆ పదం వాడితే ఇలా చేస్తోంది. విజయ్‌ దేవరకొండ ఆ పదం వాడినప్పుడు బయటకు వచ్చి ఇలాంటి పదాలు వాడకూడదని ఇండస్ట్రీ పెద్దలు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అనసూయ అనే అమ్మాయి తప్ప ఆ విషయంపై ఎవ్వరూ ఖండించలేదు. యువతలో ఇటువంటివన్నీ సినిమా వాళ్లే చొప్పిస్తున్నారు" అని అన్నారు.  

  • Loading...

More Telugu News