manmohan singh: మోదీజీ! మీరిచ్చిన సలహాను మీరే పాటించండి చాలు: మన్మోహన్ సింగ్ చురక

  • మోదీ తనను తరచూ మాట్లాడాలని కోరేవారు
  • ఆ సలహాను ఇప్పుడు ఆయనే పాటించాలి
  • కథువా, ఉన్నావో ఘటనలపై మోదీ స్పందించడం హర్షణీయం

'మోదీజీ! గతంలో మీరు నాకిచ్చిన సలహాను ఇప్పుడు మీరు పాటించండి' అంటూ మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ సూచించారు. ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తనను మౌన్-మోహన్ సింగ్ అంటూ మోదీ కామెంట్ చేసేవారని గుర్తు చేశారు. తరచూ మాట్లాడాలంటూ తనకు ఆయన సలహాలిచ్చేవారని, ఇప్పుడు ఆ సలహాను ఆయనే పాటించాలని మన్మోహన్ సింగ్ సూచించారు.

మౌనం వీడి కథువా, ఉన్నావో అత్యాచారాలపై మోదీ గత శుక్రవారం స్పందించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఇండియాస్ డాటర్స్‌ కి న్యాయం జరుగుతుందని, నేరస్థులను వదిలిపెట్టేది లేదని చెప్పారని గమనించినట్లు తెలిపారు. మోదీ మౌనంగా ఉండడంతో నేరస్థులు తప్పించుకోగలమని భావించే అవకాశం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.  

manmohan singh
Narendra Modi
New Delhi
  • Loading...

More Telugu News