Ramcharan: కొందరి పేర్లు అనవసరంగా లాగి.. పాప్యులర్ అవ్వాలని చూడటం చవకబారుతనం!: మండిపడ్డ రామ్ చరణ్ తేజ్
- ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ
- ఇక్కడ మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు
- కొందరి పేర్లను అనవసరంగా లాగి రాద్ధాంతం చేస్తున్నారు
తెలుగు సినీ పరిశ్రమపై కొందరు చేస్తోన్న ఆరోపణలపై సినీ ప్రముఖులు పలువురు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. 'అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాప్యులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది' అని ఆయన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా తన బాబాయి, సినీనటుడు పవన్ కల్యాణ్ గతంలో అభిమానులను సహనంతో ఉండాలని చెప్పిన ఓ వీడియోను కూడా చెర్రీ పోస్ట్ చేశాడు.