Uttar Pradesh: ప్రభుత్వ ఆదేశాలతో ఆ నగదును వెనక్కి మళ్లించారా?: అఖిలేష్ యాదవ్
- ఏటీఎంలలో నగదు లేకుంటే ఎక్కడుంది?
- కేంద్రం నగదును ముద్రిస్తున్నట్టు చెబుతోంది
- ఆ నగదంతా ఏమవుతోంది
ఏటీఎంలలో నగదు కొరత భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏటీఎంలలో నగదు కొరతపై లక్నోలో ఆయన మాట్లాడుతూ, ఏటీఎంలలో నగదు లేకుంటే నగదు ఎక్కడుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం నగదును పెద్ద ఎత్తున ముద్రిస్తున్నట్టు చెబుతోందని, ఏటీఎంలలో లేకుంటే ఆ నగదంతా ఏమవుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆ నగదును వెనక్కి మళ్లించారా? అని ఆయన ప్రశ్నించారు. పేపర్, ఇంక్, యంత్రాలను విదేశాల నుంచి తెప్పిస్తున్నా నగదు కొరత ఏర్పడుతోందంటే భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రేనని ఆయన పేర్కొన్నారు.