virendra sehwag: 93 ఏళ్ల అభిమానికి పాదాభివందనం చేసిన సెహ్వాగ్!

  • సెహ్వాగ్ ను కలిసేందుకు పాటియాలా నుంచి మొహాలీ వచ్చిన అభిమాని
  • అభిమానిని చూసి ఆశ్చర్యపోయిన సెహ్వాగ్
  • సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెహ్వాగ్

క్రికెటర్ గా బౌండరీలు, సిక్సర్లతో స్కోరుబోర్డును ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తరువాత సోషల్ మీడియాలో పదునైన వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్ గా ఉన్న సెహ్వాగ్ ను కలిసేందుకు ప్రత్యేకమైన అభిమాని మొహాలీ వచ్చాడు. మైదానంలో జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా, సెహ్వాగ్ పర్యవేక్షిస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్దాయన సెహ్వాగ్ దగ్గరకు వచ్చి పాటియాలా నుంచి వచ్చానని, తన పేరు ఓం ప్రకాశ్ (93) అని, మీకు పెద్ద అభిమానినని చెప్పారు.

అంత పెద్దాయన తనను కలిసేందుకు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చాడని తెలిసి సెహ్వాగ్ ఆశ్చర్యపోయాడు. ఆయన చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయాడు. పెద్దాయన పాదాలకు నమస్కారం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్ లో పంచుకోగా, పెద్ద అభిమానితో దిగిన సెల్ఫీని సెహ్వాగ్ ట్విట్టర్ లో పోస్టు చేస్తూ, ‘ఓం ప్రకాశ్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. 93 ఏళ్ల వయసులో నా కోసం పాటియాలా నుంచి వచ్చారు. నాపై ఎంతో ప్రేమ కురిపించారు. దాదాకో ప్రణామ్’ అని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

virendra sehwag
Cricketer
kings elleven punjab
  • Error fetching data: Network response was not ok

More Telugu News