madhavilata: మాధవీలతను విడుదల చేసిన పోలీసులు

  • శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మాధవీ లత మౌనదీక్ష 
  • అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
  • మధ్యాహ్నం విడుదల

జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ ముందు మౌనదీక్ష చేపట్టడంతో అరెస్టు చేసిన నటి మాధవీలతను బంజారాహిల్స్ పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీరెడ్డి పరుష పదజాలం వాడటం సరికాదని హితవు పలికింది.

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విధానంతో పవన్‌ కల్యాణ్‌ కు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌ పై శ్రీరెడ్డి పోరాటం మంచిదేనని చెప్పిన ఆమె, పోరాటానికి ఆమె ఎంచుకున్న మార్గం సరైందని కాదని అభిప్రాయపడింది. మాధవీలతకు సంఘీభావం తెలిపేందుకు పోలీస్ స్టేషన్ కు నిర్మాత పుప్పాల రమేష్, హేమ తదితరులు వెళ్లారు.

madhavilata
srireddy
Tollywood
  • Loading...

More Telugu News