Tollywood: సంధ్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జీవిత రాజశేఖర్

  • సంధ్యపై, మహాచానల్ పై సీఐ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేశాను
  • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సబబు కాదు
  • నాపై ఆరోపణలు చేసిన వారినెవరిని వదలను

తనపైన, తన కుటుంబంపైన అసత్య ఆరోపణలను చేశారంటూ సామాజిక కార్యకర్త సంధ్యపైన, వాటిని ప్రసారం చేసిన ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ పైన కేసులు పెడతానని ప్రముఖ నటి జీవిత రాజశేఖర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంధ్యపై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు.

సంధ్యపైన, మహాచానల్ పైన సీఐ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారినెవరినీ వదలనని జీవిత హెచ్చరించారు. సినీ ఆర్టిస్టులు, సెలెబ్రెటీలపై ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. అనంతరం, సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ నెల 14న జరిగిన చర్చా కార్యక్రమంలో సంధ్యతో పాటు మరికొంతమంది పాల్గొన్న సీడీని సమర్పించారని, ఆ సీడీని పరిశీలించిన అనంతరం, విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tollywood
jeevita rajashekar
sandhya
  • Loading...

More Telugu News