Tollywood: దమ్మున్న మగాడు కల్యాణ్ బాబు... మీకుందా ఆ దమ్ము?: నాగబాబు నిప్పులు

  • పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు
  • వ్యక్తిగత జీవితంలోకి వచ్చే హక్కు ఎవరికీ లేదు
  • ప్రజల కోసం పవన్ వెళ్లాడు
  • విమర్శలు చేస్తున్న వారి వెనుక కొందరు పెద్దలున్నారు 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు అనవసరంగా పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు వారికి ఎవరిచ్చారని పవన్ సోదరుడు, నటుడు నాగబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన, ఏదైనా తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిరంగంగా చెప్పే దమ్మున్న మగాడు తన సోదరుడని అన్నారు.

"మీరు అనుకున్నంత ఇది కాదు. కల్యాణ్ బాబు తప్పు చేస్తే, పబ్లిక్ లో బహిరంగంగా నిలబడి నేనీ తప్పు చేశానని ఒప్పుకునే దమ్మున్న మగాడు నా తమ్ముడు. మీకుందా ఆ దమ్ము? మీకు లేదు... వాడు ప్రజల కోసం వెళ్లాడు. నా తమ్ముడు నాతో మాట్లాడి కనీసం ఆరు నెలలైంది. నేను డిస్టర్బ్ చేయడం లేదు. వెళ్లిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు వచ్చే ఇక్కడే ఉండొచ్చుకదా? అంటే మా మాట కూడా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. వాడు నంబర్ వన్ స్టార్. వాడిని అంటారా? వాడిని తిడతారా? వాడిని విమర్శిస్తారా? విమర్శించండి. పొలిటికల్ గా... వ్యక్తిగతంగా విమర్శిస్తారా?" అంటూ విరుచుకుపడ్డారు.

తప్పు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరని, వ్యక్తిగతంగా ఎవరిని తవ్వినా దొరుకుతారని, కావాల్సింది అది కాదని అన్నారు. పవన్ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. విమర్శలు చేస్తున్న వారి వెనక ఎవరున్నారో తమకు తెలుసునని, అందరి ... తీరుస్తాడని అన్నారు. అతి త్వరలోనే ఇది జరుగుతుందని చెప్పారు.

Tollywood
Casting Couch
Pawan Kalyan
Nagababu
  • Loading...

More Telugu News