Beautisian: టీవీ చానల్ ముందు ప్రత్యక్షమైన బ్యూటీషియన్ జ్యోతి ప్రియుడు సందీప్!

- మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో జ్యోతి మృతి
- ఘటనతో తనకు సంబంధం లేదన్న సందీప్
- పోలీసులు గాలిస్తుండగా టీవీ చానల్ లో ప్రత్యక్షం
మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరుకు రైలులో వెళుతూ, పట్టాలపై విగతజీవిగా కనిపించిన బ్యూటీషియన్ జ్యోతి ప్రియుడు ఓ టీవీ చానల్ ముందు ప్రత్యక్షమై, ఆమె మృతితో తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పాడు. జ్యోతి మృతి వెనుక సందీప్ హస్తం ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలి అనుమానితుడిగా సందీప్ పేరునే చేర్చిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
