Hyderabad: పోలీసుల అదుపులో నటి మాధవీలత... స్టేషన్ లో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా దీక్ష!

  • నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు
  • దీక్షను భగ్నం చేసి, అరెస్ట్ 
  • స్టేషన్ లో కొనసాగుతున్న దీక్ష

పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు మౌన దీక్షకు దిగిన నటి మాధవీలతను, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా నిరసనలు చేస్తున్నారంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ప్రస్తుతం ఆమె స్టేషన్ లోనే మౌనదీక్షకు దిగింది. పోలీసులు తనను స్టేషన్ కు తీసుకెళ్లారని, అయినా, తాను దీక్షను వదిలేది లేదని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో వ్యాఖ్యానించింది.

ఎవరు వచ్చినా, రాకున్నా తాను మాత్రం స్టేషన్ లోనే దీక్షను కంటిన్యూ చేస్తానని చెప్పింది. లవ్ ఇండియా, లవ్ మై లాంగ్వేజ్ అన్న నినాదాన్ని తన పోస్టుకు జోడించింది. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోందని భావించిన పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లను పిలిపించారు. అక్కడ మాధవీలతతో కూర్చుని ఉన్న పవన్ అభిమానులను తొలుత పంపించేసిన పోలీసులు, ఆపై ఆమెను స్టేషన్ కు తరలించారు.

Hyderabad
Police
Madhavi Latha
Banjarahills
  • Loading...

More Telugu News