Tollywood: టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ముందు మాధవీలత... ఉద్రిక్తత!

  • పవన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన మాధవీలత
  • మౌన దీక్ష చేస్తానంటూ బైఠాయింపు
  • మద్దతిచ్చిన పవన్ అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ, మరో నటి మాధవీలత నిరసన చేసేందుకు జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు దీక్షకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. "పోరాటం అంటే తిట్లే కాదు... మౌనంగానూ నిరసిద్దాం" అని రాసిన ప్లకార్డుతో ఆమె మౌన దీక్షకు దిగగా, అక్కడ భారీ ఎత్తున సినీ అభిమానులు చేరారు.

ఇదే సమయంలో శ్రీరెడ్డి అభిమానులు అక్కడికి చేరుకుంటుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, మాధవీలతను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మాధవీలతకు పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి, 'మా' ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు ఆమెతో పాటు దీక్షలో కూర్చోగా, పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు మాధవీలత సమాధానాలను కాగితంపై రాస్తోంది. తాము స్లోగన్స్ ఇవ్వబోమని, మౌనంగా ఒంటిగంట వరకూ కూర్చుంటానని ఆమె రాసి చూపింది.

Tollywood
Film Chamber
Madhavi lata
Sri reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News