Facebook: కేసీఆర్ ఆలస్యం చేస్తారేమో... తోలు తీయడం పక్కా!: శ్రీరెడ్డి

  • లైంగిక వేధింపులను ఆయన అడ్డుకుంటారు
  • నాకు కేసీఆర్ పై నమ్మకం ఉంది
  • ఫేస్ బుక్ లో నటి శ్రీరెడ్డి

టాలీవుడ్ లో మహిళా నటులను లైంగికంగా వేధిస్తున్న వారిని తెలంగాణ సీఎం కేసీఆర్ వదిలిపెట్టబోరని నటి శ్రీరెడ్డి అభిప్రాయపడింది. "నా అభిమాన స్టార్ కేసీఆర్ పై నాకు నమ్మకం ఉంది. కొంచం ఆలస్యం కావచ్చేమో. అందరి తోలు తీయడం మాత్రం పక్కా" అని తన ఫేస్ బుక్ ఖాతాలో వ్యాఖ్యానించింది. అంతకుముందు, పవన్ కల్యాణ్ అభిమానులు చేస్తున్న విమర్శలను గుర్తు చేస్తూ, తాను తన నిరసనలు తెలియజేయాలా? లేక పవన్ పై దృష్టిని పెట్టాలా? అని ప్రశ్నించింది. తనను వేలెత్తి చూపించడం ఆపాలని, పవన్ కల్యాణ్ తన అభిమానులను నియంత్రిస్తారనే భావిస్తున్నానని చెప్పింది.

Facebook
Sri Reddy
KCR
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News