Karnataka: కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డేపై హత్యాయత్నం?

- కర్ణాటక ప్రచారంలో బిజీగా అనంతకుమార్ హెగ్డే
- గత రాత్రి హవేరీ జిల్లాలో హత్యాయత్నం
- కారును బలంగా ఢీకొన్న ట్రక్కు
- డ్రైవర్ ను విచారించి నిజం కక్కించాలన్న హెగ్డే
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా తిరుగుతున్న కేంద్ర నైపుణ్య శాఖ సహాయ మంత్రి అనంతకుమార్ హెగ్డేపై గత రాత్రి హత్యాయత్నం జరుగగా, ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ భారీ ట్రక్కు బలంగా ఢీకొంది. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ప్రమాదం జరుగగా, తనను చంపేందుకే ఈ దాడి జరిగిందని హెగ్డే ఆరోపించారు. ఎవరో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, పోలీసులు ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
