Tamilnadu: మహిళా జర్నలిస్టుపై తమిళనాడు గవర్నర్ అనుచిత ప్రవర్తన... వైరల్ అవుతున్న ఫొటోలు!

  • అనుచితుల జాబితాలో భన్వరిలాల్
  • మీడియా సమావేశంలో యువతి చెంప నిమిరిన గవర్నర్
  • ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? అని ఆగ్రహం

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా జర్నలిస్టు చెంపను ఆయన తాకారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి, ఓ విద్యార్థినిని లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూ, ఫోన్ లో మాట్లాడుతున్న వేళ, తనకు గవర్నర్ తెలుసునని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దాన్ని ఖండించేందుకు గవర్నర్ మీడియా సమావేశాన్ని పెట్టారు.

 ఆమెతో తనకు సంబంధం లేదని చెప్పిన గవర్నర్, పలు ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఆయన తిరిగి వెళుతున్న సమయంలో ఓ యువ జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించగా, ఆయన సమాధానం ఇవ్వకుండా, ఆమె చెంపపై నిమరడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

 "విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు" అని సదరు జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో వాపోయింది. గవర్నర్ మహిళ చెంపను తాకుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పలువురు భన్వరిలాల్ వైఖరిని తప్పుబడుతున్నారు.

Tamilnadu
Governer
Bhanwarilal
Lady Journalist
  • Loading...

More Telugu News