Vijayanagaram District: విజయనగరం అదనపు జాయింట్ కలెక్టర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-3f4dfd612a2247b5e7ec4568d7d832c6bd366ff2.jpg)
- ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు
- 11 చోట్ల ఏకకాలంలో సోదాలు
- వివిధ ప్రాంతాలలో సోదాలు
విజయనగరం అదనపు జాయింట్ కలెక్టర్ కాకరాల నాగేశ్వరరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ సోదాలు జరిపింది. నాగేశ్వరరావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై 11 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. విశాఖలో 6 చోట్ల, విజయనగరంలో 3 చోట్ల తనిఖీలు చేయగా, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, కర్ణాటకలోని దావణగేరెలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.