madhaveelata: జీవిత గారూ! మిమ్మల్నెవరు వెతికి పట్టుకున్నారు?: మాధవీలత సూటి ప్రశ్న

  • టాలెంట్ ఉంటే వెతికి పట్టుకుని అవకాశాలు ఇస్తారా?
  • అవకాశం ఇస్తేనే ప్రూవ్ చేసుకుంటారు
  • ఈ క్షణం నుంచి గౌరవం పోయింది 

సినీ నటి జీవిత రాజశేఖర్ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెబుతూ, టాలెంట్ ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని, ఊరికే ఎవరూ వేషాలివ్వరు కదా? అని చెబుతూ, తనపై ఆరోపణలు చేసిన వారికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మరో నటి మాధవీ లత, తన ఫేస్ బుక్ పేజీలో సూటిగా కొన్ని విషయాలు అడిగింది.

‘‘ఇన్నాళ్లు బయటికి రాని జీవితగారు ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చారు? ఆవిడ మీద ఆరోపణ వచ్చిందని వచ్చారా? టాలెంట్ ఉంటే వెతికి పట్టుకుని అవకాశాలు ఇస్తారా? హాహాహా.. ఈవిడని ఎవరు వెతికి పట్టుకున్నారట? అవకాశం ఇస్తేనే ప్రూవ్ చేసుకుంటారు. ఇవ్వకపోతే ఎలా వెతుకుతారు? ఇన్నాళ్లు గౌరవం ఉండేది. ఈ క్షణం పోయింది. నేను ఖండిస్తున్నా’’ అంటూ ఆమె ఒక పోస్టు పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.

madhaveelata
jeevita
Facebook
  • Loading...

More Telugu News