artist jeevita: నటి జీవిత వ్యాఖ్యలపై స్పందించిన సామాజిక కార్యకర్త సంధ్య

  • నా వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉన్నాయి
  • బాధిత యువతులే నా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు
  • ఇది జీవితకు, నాకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు
  • కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా

తనపైన, తన కుటుంబంపైన అసత్య ఆరోపణలను చేశారంటూ సామాజిక కార్యకర్త సంధ్యపైన, వాటిని ప్రసారం చేసిన ప్రముఖ న్యూస్‌ ఛానల్‌పైన కేసులు పెడతానని ప్రముఖ నటి జీవిత రాజశేఖర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంధ్య స్పందిస్తూ, తాను చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉన్నాయని, బాధిత యువతులే తన దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారని, అవన్నీ చెబితే చాలా అసహ్యంగా ఉంటుందని అన్నారు.

ఇది కేవలం జీవితకు, తనకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని చెప్పిన సంధ్య, సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, కమిట్ మెంట్ సిస్టమ్ లేదని జీవిత మాట్లాడటం కరెక్టు కాదనే దృష్టితోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, జీవిత అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని, తమ పోరాటం ఎప్పుడూ బాధిత మహిళల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు.

artist jeevita
social activist sandhya
  • Loading...

More Telugu News