kambhampati haribabu: అందుకే కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు: అమిత్‌ షా

  • త్వరలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తాం
  • కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా
  • చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు 
  • టీడీపీతో తెగదెంపులతో కొత్త అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది

త్వరలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని వెల్లడించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ నుంచి ఆయనే వెళ్లిపోయారని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో తెగదెంపులతో బీజేపీ ఏపీ కొత్త అధ్యక్షుడి మార్పు అనివార్యమైందని అన్నారు. అలాగే, రాష్ట్ర కార్యవర్గంలోనూ 80 శాతం మంది టీడీపీతో పొత్తు వద్దని కోరుకున్నారని తెలిపారు.

కాగా, ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. కర్ణాటక ఎన్నికల తరువాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది, ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించనున్నట్లు సమాచారం. 

kambhampati haribabu
amith shah
BJP
  • Loading...

More Telugu News