cricketer: విమానంలో ప్రయాణిస్తూ.. క్రికెటర్ ధావన్ ఏం చేశాడో చూడండి!

  • సన్ రైజర్స్ జట్టుతో కలిసి ధావన్ విమానం ప్రయాణం 
  • నిద్రపోతున్న ఆటగాళ్లను ఆటపట్టించిన వైనం
  • సరదాగా నవ్వుకున్న ఆటగాళ్లు

ఐపీఎల్ -2018 సీజన్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లలో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి జోరు మీద ఉంది. మైదానంలో తమ సత్తా చాటుతున్న సన్ రైజర్స్ జట్టు, విమాన ప్రయాణ సమయాల్లో సరదాగా గడుపుతోంది. అందుకు నిదర్శనం, సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన పనే! తోటి ఆటగాళ్లతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న శిఖర్ ధావన్, నిద్రపోతున్న ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, రషీద్ ఖాన్ లను ఆటపట్టించాడు.

ఓ పేపర్ ను గుండ్రంగా చుట్టి నిద్రపోతున్న వాళ్లిద్దరి దగ్గరకు వెళ్లి ముక్కుల్లో పెట్టి వారి నిద్ర చెడగొట్టాడు.నిద్రలోకి జారుకున్న ఆటగాళ్లకు అసలు ఏం జరిగిందో అర్థం కాకపోయినప్పటికీ, ‘ఇది ధావన్ పనే’ అని ఆ తర్వాత తెలుసుకుని నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చేరి వైరల్ గా మారింది.

cricketer
shikar dhawan
  • Error fetching data: Network response was not ok

More Telugu News